రెండో పెళ్లి.. మీకు ఓకే అయితే నాకు ఓకే: నాగబాబు

చేతిలో ఫోన్లు, అందుబాటులో ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రాములు.. ఏం రాసినా, ఏం అడిగినా.. ప్రశ్నించే వారు లేరు. రాస్కో నా సామి చెప్పేస్తా ఆన్సర్ అంటున్నారు సెలబ్రెటీలు సైతం. నెటిజన్స్ అడిగే ప్రశ్నలను సరదాగా తీసుకుంటున్నారు.. మరీ హద్దు మీరిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు కానీ ఒక మాదిరి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు.
ఇరుకున పెట్టే ప్రశ్నలైనా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లోకి వచ్చిన నాగబాబుని ఓ నెటజన్.. సర్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా.. ఈ వయసులో నాకు పెళ్లా.. సరే మీకు ఓకే అయితే నాకు ఓకే అంటూ సరదాగా బదులిచ్చారు. నాగబాబు చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంటే రెండో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే అన్నమాట.. ఏవండీ మీరు కూడా మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బాటలో ప్రయాణించాలనుకుంటున్నారా ఏంటీ అంటూ పలువురు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పెళ్లిపై ఆయన చేసిన కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com