బిగ్‌బాస్ వేదికపైకి నాగచైతన్య !!

బిగ్‌బాస్ వేదికపైకి నాగచైతన్య !!
గట్టి పోటీ దారులు ఈ సీజన్ లో ఎవరూ కనిపించకపోవడంతో ఆడియన్స్ కి బోరు కొడుతోంది.

బిగ్‌బాస్ నాలుగో సీజన్ గట్టే మార్గం కనిపించట్లేదు.. గట్టి పోటీ దారులు ఈ సీజన్ లో ఎవరూ కనిపించకపోవడంతో ఆడియన్స్ కి బోరు కొడుతోంది. దసరాకి సమంత వచ్చి సరదాగా సందడి చేసినా మళ్లీ మొదటికే వచ్చింది.. ఓ వీక్ లో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందనే సరికి హౌస్ హరివిల్లుగా మారుతుందనుకున్నారు.. కానీ అంతలోనే ఆమె స్టేజ్ పైకి వచ్చి నాకు సినిమా ఓపెనింగ్ కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పడంతో ప్రేక్షకులు నీరుగారిపోయారు.

ఇక ఈ వీకెండ్ అయినా రేటింగ్ పెరగకపోతే బిగ్‌బాస్ కి చాలా కష్టం అని భావిస్తున్నారు షో నిర్వాహకులు. అక్కినేని ఫ్యామిలీలోని ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నారు.. అందుకు నాగచైతన్యను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ గెస్ట్ గా నాగ చైతన్యతో పాటు మరొకరు కూడా వస్తున్నట్లు సమాచారం.. ఇంతకీ ఆయన ఎవరనేది సీక్రెట్ గా ఉంచారు నిర్వాహకులు.. ఆ హీరో ఎవరో స్టేజ్ పైన చూస్తేనే థ్రిల్ గా ఉంటుందిలే అని బుల్లితెర ప్రేక్షకులు సరిపెట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story