#NC22 : నాగచైతన్య ఆసక్తికరమైన పోస్ట్.. కృతి శెట్టితో కలిసి..

X
By - Sai Gnan |20 Sept 2022 6:45 PM IST
#NC22 : లాల్ సింగ్ చడ్డా తరువాత నాగచైతన్య మరో కొత్త సినిమాతో మనముందుకు వస్తున్నారు
#NC22 : లాల్ సింగ్ చడ్డా తరువాత నాగచైతన్య మరో కొత్త సినిమాతో మనముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి నాగచైతన్య ట్విట్టర్ వేదిక ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పేరు ఖరారు కానీ ఈ సినిమాకు #NC22 అని వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. చైతూ కెరీర్‌లో ఇది 22వ సినిమా కానుంది. వెంటక్ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
రేపటినుంచే షూటింగ్ ప్రారంభం అని నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరరి నిర్మించనున్నారు. ఇళయరాజా, యువన్‌శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com