కొడుకు పెళ్లి.. కోరుకున్న అమ్మాయితో: నాగబాబు

కొడుకు పెళ్లి.. కోరుకున్న అమ్మాయితో: నాగబాబు
ఆమె ఎక్కడ ఉన్నా ఎక్కువగా అల్లరి చేస్తుంటుందన్నారు.

ఈ మధ్యే అమ్మాయి నిహారిక పెళ్లి రిలాక్స్ అయ్యారు. ఇక అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు అని ఎవరైనా అడిగితే మంచి అమ్మాయి, అతడిని అర్థం చేసుకునే కోడలు దొరికితే చేస్తామంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. నిహారిక చాలా అల్లరి పిల్ల అయితే వరుణ్ చాలా కామ్‌గా ఉంటాడని తెలిపారు. తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. అందుకే వరుణ్ పుట్టిన తరువాత అమ్మాయి పుట్టాలని కోరుకున్నాను. అన్నట్లుగానే నిహారిక జన్మించిందన్నారు.

నిహా తనకు కేవలం కూతురు మాత్రమే కాదని, అంతకు మించి బెస్ట్ ఫ్రెండ్ అని నాగబాబు తెలిపారు. పెళ్లి తర్వాత కూతురితో కొంచెం మాటలు తగ్గాయన్నారు. కొత్త జీవితంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆమె ఎక్కడ ఉన్నా ఎక్కువగా అల్లరి చేస్తుంటుందన్నారు. వరుణ్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. ఇంట్లో, కొంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే వరుణ్ ఓపెన్‌గా ఉంటాడన్నారు. పబ్లిక్‌లోకి వెళితే మాత్రం ఎవరితో మాట్లాడడని, మౌనాన్ని ఆశ్రయిస్తాడని చెప్పారు.

పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు రావాలని ప్రతి తండ్రి మాదిరిగానే తాను కోరుకున్నానని చెప్పారు. అందువల్ల వరుణ్‌కి ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే అంశాలకంటే, అతడిని అర్ధం చేసుకునే మంచి భార్య రావాలని కోరుకుంటున్నట్లు తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story