Nagarjuna 100th Film: నాగార్జున 100వ సినిమా.. కొడుకుతో కలిసి మల్టీ స్టారర్..

Nagarjuna 100th Film: నటీనటుల కెరీర్‌లో కొన్ని సినిమాలు ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలపై వారు ప్రత్యేకంగా దృష్టిపెడతారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో సీనియర్ హీరోలయిన చిరంజీవి 150 సినిమాల మార్క్‌ను, బాలకృష్ణ 100 సినిమాల మార్క్‌ను టచ్ చేశారు. వారి తరువాత నాగార్జున.. ఇప్పుడు తన ల్యాండ్ మార్క్ 100వ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు.
నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో 'ది ఘోస్ట్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలయ్యి అందరి అంచనాలను పెంచేసింది. ది ఘోస్ట్.. నాగార్జున కెరీర్‌లో 99వ చిత్రం. ఇక 99వ చిత్రం బాధ్యతలు పూర్తవ్వడంతో 100 వ సినిమాపై దృష్టిపెడుతున్నారు నాగ్. ఇప్పటికే నాగార్జున 100వ చిత్రం కోసం పలువురు సీనియర్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా.. ఫైనల్‌గా ఓ తమిళ డైరెక్టర్ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్లినట్టు సమాచారం.
ప్రముఖ తమిళ డైరెక్టర్ మోహన్ రాజా.. త్వరలోనే చిరంజీవితో చేస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీతో తెలుగులో డెబ్యూ చేయనున్నారు. అయితే ఇటీవల మోహన్ రాజా.. నాగార్జునకు ఓ కథ వినిపించగా.. అది తనకు బాగా నచ్చిందట. ఈ మూవీలో నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున, అఖిల్ కలిసి 'మనం', 'అఖిల్' చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నాగ్ 100వ చిత్రం కోసం ముచ్చటగా మూడోసారి కలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com