Nagarjuna: 'తన పేరు చెప్తే మొహం వెలిగిపోతుంది'.. టబుతో రిలేషన్‌పై నాగ్ కామెంట్స్

Nagarjuna: తన పేరు చెప్తే మొహం వెలిగిపోతుంది.. టబుతో రిలేషన్‌పై నాగ్ కామెంట్స్
Nagarjuna: నాగార్జున, టబు కలిసి చేసింది రెండు సినిమాలే. కానీ అందులో ఒకటైన ‘నిన్నే పెళ్లాడతా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది

Nagarjuna: ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, క్యూట్ కపుల్ లాంటి హీరోహీరోయిన్ జంటలు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటినుండో ఉన్నాయి. సీనియర్ హీరోలు కూడా కొందరు హీరోయిన్లతో జతకడితే ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవారు. అలా ముందు తరం వారిలో నాగార్జున, టబు జోడీ అంటే చాలా క్రేజ్ ఉండేది. అయితే టబుతో తనకు ఉన్న రిలేషన్ గురించి నాగార్జున మరోసారి ఓపెన్ అయ్యారు.

నాగార్జున, టబు కలిసి చేసింది రెండు సినిమాలే. కానీ అందులో ఒకటైన 'నిన్నే పెళ్లాడతా' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దానికి ఒక ముఖ్య కారణం నాగార్జున, టబుల కెమిస్ట్రీనే. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ మేమిద్దరం మంచి స్నేహితులమంటూ నాగార్జున వాటిని కొట్టిపారేశారు. ప్రస్తుతం టబు.. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తుండగా నాగ్‌కు మళ్లీ అదే ప్రశ్న ఎదురయ్యింది.

టబు తనకు మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చారు నాగార్జున. జీవితంలో సగం కాలం నుండి తమ స్నేహం కొనసాగుతుంది అన్నారు. అయితే తమ స్నేహం గురించి తాను దాచడానికి ఏమీ లేదన్నారు. టబు పేరు చెప్తే తన మొహం వెలిగిపోతుందని, దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుందని తేల్చేశారు. తన వరకు టబు ఒక అందమైన ఫ్రెండ్ అని ఎప్పటికి అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు నాగ్.



Tags

Read MoreRead Less
Next Story