బిగ్ బాస్.. అసలే బోరింగ్ టాస్క్.. దాన్ని మళ్లీ మూడు రోజులు సాగదీసి..

బిగ్ బాస్.. అసలే బోరింగ్ టాస్క్.. దాన్ని మళ్లీ మూడు రోజులు సాగదీసి..
మోనాల్ ని ఆ సీన్లో చూడలేక అరియానా ఇద్దరూ కలిసి

పిచ్చి పిచ్చి గెంతులు.. మధ్యలో కౌగిలింతలు.. మంచి మనుషులు.. కొంటె రాక్షసులు.. మధ్య నడిచిన టాస్క్ బుల్లి తెర ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. బిగ్ బాస్ హౌస్ లో బోరింగ్ టాస్క్ ఏదైనా ఉందీ అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు. అరియానా పిల్ల రాక్షసి పాత్రలో జీవించేసింది.. అవినాష్ కూడా రాక్షసలోకానికి రాజన్నట్లు ప్రతిభను ప్రదర్శించాడు. అందుకే వాళ్లిద్దరు టాస్క్ లో జీవించేశారని నోయల్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అడక్కపోయినా హగ్గిచ్చే మోనాల్ ఈసారి అవినాష్ కి ఆ అవకాశం ఇచ్చింది. అది చూసి మెహబూబ్ కూడా లైన్లో ఉన్నాడు.

ఆమెకు బిగ్ బాస్ స్ట్రిక్ట్ గా ఇన్ స్ట్రక్షన్ ఇచ్చి పంపించారేమో అన్నంతగా హగ్గులతో టాస్క్ ని కంప్లీట్ చేసింది. అవినాష్, మోనాల్ ని ఆ సీన్లో చూడలేక అరియానా ఇద్దరూ కలిసి చచ్చిపోండి అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. లాస్య కూడా మీ పని పూర్తయ్యాక చెప్పండి, చూడలేకపోతున్నాం అంటూ అక్కడి నుంచి దూరం జరిగింది. హౌస్ లో ఉన్న ఆమె ఇబ్బంది పడుతోంది ఇలాంటి దృశ్యాలు చూడ్డానికి, టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులూ ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి పిచ్చి టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు ఇంటి సభ్యులు అని బిగ్ బాస్ కితాబిచ్చారు.

Tags

Next Story