రంగబలితో బౌన్స్ బ్యాక్ అవుతానంటోన్న నాగశౌర్య
ఇప్పటి వరకూ ఒక లెక్క రంగ బలి నుంచి ఒక లెక్క అని అంటున్నాడు నాగ శౌర్య. పవన్ తన కెరియర్ కి టర్న్ ఇవ్వబోతున్నాడు అని ప్రమోషన్స్ లో నమ్మకం గా చెబుతున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ లో ఒకరైన నాగ శౌర్య కి కెరియర్ లో హిట్స్ ఉన్నాయి కానీ బెంచ్ మార్క్ హిట్ ఇప్పటి వరకూ పడలేదు. ఊహలు గుస గుస లాడే... ఛలో వంటి హిట్స్ ఖాతా లో ఉన్నా.. నాగ శౌర్య బ్రాండ్ బిల్ట్ అయ్యే హిట్ ఇప్పటి వరకూ రాలేదు. సొంత బ్యానర్ లో చేసిన జాదూగాడు, అశ్వ ద్దమా కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు రంగబలితో యూత్ లో తనదైన మార్క్ ని క్రియేట్ చేసే ప్రయత్నాలు విజంవంతం అవుతాయి అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హీరో మెటీరియల్ అయిన నాగ శౌర్యకి రంగబలి బ్రేక్ ఇస్తుందని చిత్ర బృందం కూడా బలంగా నమ్ముతోంది. యూత్ లో రంగబలి కి వచ్చే ఇంపాక్ట్ నాగ శౌర్య కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిద్దాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com