Namrata Shirodkar: సినిమాల్లోకి రీ ఎంట్రీ అంశంపై నమ్రత క్లారిటీ..

Namrata Shirodkar: సినిమాల్లోకి రీ ఎంట్రీ అంశంపై నమ్రత క్లారిటీ..
Namrata Shirodkar: ప్రస్తుతం నమ్రత.. మహేశ్ బాబు సినిమా విషయాలు చూసుకుంటూ, జీఎంబీ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో బిజీగా ఉంటోంది.

Namrata Shirodkar: హీరోలకు ఉన్నంత కెరీర్ టైమ్ హీరోయిన్లకు ఉండదు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న పోటీ మధ్యలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఎక్కువకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తమ పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టడానికి స్వచ్ఛందంగా సినిమాల నుండి తప్పుకుంటారు. అలాంటి వారిలో ఒకరే మహేశ్ బాబు సతీమణి నమ్రత.

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. మిస్ ఇండియా కిరీటాన్ని కూడా దక్కించుకుంది నమ్రత. దీంతో తనకు బాలీవుడ్, టాలీవుడ్ నుండి వెంటవెంటనే ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని చిత్రాల్లో నటించగానే మహేశ్ బాబును పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. కెరీర్ మొదట్లోనే పెళ్లి అవ్వడంతో కొన్నాళ్ల తర్వాత అయినా నమత్ర మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు.

ప్రస్తుతం నమ్రత.. తన భర్త మహేశ్ బాబు సినిమా విషయాలు చూసుకుంటూ, జీఎంబీ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో బిజీగా ఉంటోంది. ఇటీవల మరోసారి తన రీ ఎంట్రీ అంశంపై క్లారిటీ ఇచ్చింది నమ్రత. తిరిగి తాను సినిమాల్లో నటించాలని చాలామంది కోరుకుంటున్నారని, కానీ వారందరినీ తాను ఎప్పుడూ హర్ట్ చేస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది నమ్రత.

ప్రస్తుతం తాను కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో బిజీగా ఉన్నానని మరోసారి గుర్తుచేసింది నమ్రత. పైగా అదే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది. అంతే కాకుండా తనకు మళ్లీ నటించే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. అందుకే మహేశ్ బాబుతో కలిసి పలు ఫోటోషూట్స్‌లో తప్ప నమ్రత ఈమధ్య పెద్దగా కెమెరా ముందుకు రావడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story