13 Aug 2022 11:15 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Namrata Shirodkar:...

Namrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర పోస్ట్..

Namrata Shirodkar: టాలీవుడ్‌లోని క్యూట్ ఫామిలీలలో మహేశ్ బాబు ఫ్యామిలీ ఒకటి.

Namrata Shirodkar: నువ్వు ఎగరడానికి సిద్ధం.. కుమారుడిపై నమత్ర పోస్ట్..
X

Namrata Shirodkar: టాలీవుడ్‌లోని క్యూట్ ఫామిలీలలో మహేశ్ బాబు ఫ్యామిలీ ఒకటి. తరచుగా హాలీడేస్‌కు వెళ్లే వీరు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక మహేశ్ తన కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి తను కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు.. పూర్తిస్థాయి ఫ్యామిలీ మ్యాన్ కూడా అనిపించుకున్నాడు. ఇక ఇటీవల మహేశ్ కుమారుడు గౌతమ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది నమ్రత.

మహేశ్, నమ్రత కలిసి చేసిన మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. కొడుకు, కూతురుతో హ్యాపీగా ఫ్యామిలీను లీడ్ చేస్తోంది. ఇక ఇప్పటికే గౌతమ్.. కేవలం చదువులోనే కాకుండా పలు ఇతర విభాగాల్లో కూడా శభాష్ అనిపించుకుంటూ వస్తున్నాడు.

ఇటీవల నమ్రత.. తన కొడుకు గౌతమ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మా కొడుకు గౌతమ్ మహేశ్ బాబుకు ప్రతిరూపం లాంటివాడు. చలి, మంచు, ఎండ.. ఏదీ తనను ఎఫెక్ట్ చేయలేదు అనిపిస్తుంది. తన ప్రవర్తన నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పారాగ్లైడింగ్ లెసన్ వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నీ బాధ్యత నువ్వు చూసుకోగలవని నేను బలంగా నమ్ముతున్నాను.' అంటూ పోస్ట్ చేసింది నమ్రత.


Next Story