ఆ అరుదైన రికార్డు ఇంకా ఈ నందమూరి హీరో పైనే... !

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ కొందరు మాత్రమే క్లిక్ అయ్యారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదగగా, కళ్యాణ్‌రామ్ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇదే వంశం నుంచి మరో హీరో కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతనే నందమూరి తారకరత్న.
నందమూరి మోహనకృష్ణ తనయుడే ఈ తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా పెద్దగా క్లిక్ అవ్వని తారకరత్న.. రవిబాబు తెరకెక్కించిన అమరావతి సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో ఆయన నటనకి నంది అవార్డు వచ్చింది. అయితే ఏ హీరోకి లేని ట్రాక్ రికార్డు ఇప్పటికీ ఈ హీరో పైనే ఉంది.
ఇండస్ట్రీకి ఏ హీరో అయిన ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు. కానీ ఈ హీరో ఏకంగా తొమ్మిది సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో పాటుగా మరో 8 సినిమాలను కూడా ఒకేరోజు మొదలు పెట్టాడు తారకరత్న. అయితే ఇందులో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగా మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.
ఇప్పటికీ ఈ రికార్డు ఈ హీరో పైనే ఉండడం విశేషం. కాగా ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com