టాలీవుడ్

Nani: 'దసరా' కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..

Nani: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Nani: దసరా కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..
X

Nani: నేచురల్ స్టార్ నాని.. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తాను చేసిన సినిమాలు భారీ లాభాలు సాధించపోయినా.. నష్టాలు తెచ్చిపెట్టే సందర్భాలు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నా నాని.. త్వరలోనే దసరా అనే సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా కోసం నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట.

నానిని మామూలుగా పక్కింటి అబ్బాయి పాత్రలలోనే ఎక్కువగా చూశారు ప్రేక్షకులు. కానీ ఈమధ్యకాలంలో నాని కాస్త రూటు మార్చాడు. ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అలా ప్రయోగం చేసిన శ్యామ్ సింగరాయ్ క్లీన్ హిట్‌ను అందుకుంది. తరువాత తను చేస్తున్న దసరా కూడా ఓ విధమైన ప్రయోగంలాంటిదే. ఇప్పటికే విడుదలయిన దసరా మూవీ గ్లింప్స్ చూస్తే ఈ విషయం అర్థమయిపోతుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా అవుతుందట. అందుకే కొన్నాళ్ల ఈ మూవీ షూట్‌కు బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. కానీ నానికి దసరా కథపై చాలా నమ్మకం ఉండడంతో తన రెమ్యునరేషన్ తగ్గించడానికి సిద్ధపడ్డాడని సమాచారం. సినిమాకు సమస్య వస్తే.. తన రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం నానికి కొత్తేమీ కాదు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES