Nani: తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో నాని మరో సినిమా..

Nani: తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో నాని మరో సినిమా..
Nani: నాని.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో వరకు ఎదిగాడు.

Nani: నేచురల్ స్టార్ నాని సక్సెస్ రేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు చిత్రాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు నాని. పక్కింటబ్బాయి పాత్రలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాని కెరీర్‌ను మరో మలుపు తిప్పిన దర్శకుడితో మరోసారి చేయి కలపనున్నాడని టాక్ వినిపిస్తోంది.

నాని.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో వరకు ఎదిగాడు. హీరోగా మారిన తర్వాత కొంతకాలం తన సినిమాలు అలరించినా.. ఆ తర్వాత చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ ఒక్కసారిగా 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో నాని కెరీర్ టర్న్ అయిపోయింది.

భలే భలే మగాడివోయ్‌ను తెరకెక్కించిన మారుతితో నాని ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాని.. దసరా అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే నాని లుక్స్ వల్ల దసరా చిత్రానికి హైప్ క్రియేట్ అయ్యింది. మరోవైపు మారుతి కూడా తాను తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.



Tags

Read MoreRead Less
Next Story