7 Aug 2022 10:55 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Nani: 'దసరా' సినిమా...

Nani: 'దసరా' సినిమా షూటింగ్‌లో నేచురల్ స్టార్‌కు ప్రమాదం..

Nani: శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న ‘దసరా’లో నాని మొదటిసారిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నాడు.

Nani: దసరా సినిమా షూటింగ్‌లో నేచురల్ స్టార్‌కు ప్రమాదం..
X

Nani: మామూలుగా సినిమా షూటింగ్స్ అంటే యూనిట్ అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'దసరా' సినిమా షూటింగ్‌లో కూడా ఓ ప్రమాదం జరిగిందని సమాచారం.

నేచురల్ స్టార్ నాని సినిమాల నుండి దూరంగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వగానే మరో షూటింగ్ సెట్‌లో అడుగుపెడతాడు ఈ హీరో. అంతే కాకుండా దాదాపు మూడు నెలల్లో మూవీ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొస్తాడు. ఇక చివరిగా 'అంటే సుందరానికీ'తో అలరించిన నాని.. ఇప్పుడు 'దసరా' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న 'దసరా'లో నాని మొదటిసారిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నాడు. అంతే కాకుండా మూవీ పోస్టర్, గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ గోదావరి ఖనిలో జరుగుతోంది. అక్కడ బొగ్గు గనిలో షూటింగ్ జరుతుండగా.. ఓ ట్రక్ కింద ఉన్న నానిపై బొగ్గు అంతా పడిందని సమాచారం. కానీ ఈ ప్రమాదం వల్ల నానికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.


Next Story