Nani Mrunal Thakur: నేచురల్ స్టార్ తో సీత... టీజర్ అదిరిందిగా...

వరుస సినిమాలతో అదర గొడుతున్న నాచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే దసరా సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నా.. 2023లో రాబోతున్న తన 30వ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇక నానీకి జోడీగా అందాల సీత తళుక్కుమనబోతోందట.
సీతారామం సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ మరో సారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాని సరసన చేరింది. దీంతో నాని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన నాని30 టీజర్ యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతుంది.
తండ్రి కూతుళ్ల మధ్య సంభాషణతో సాగే టీజర్ ఆద్యంతం హృద్యంగా మనసును హత్తుకుంటుంది. కాగా ఈ సినిమా పూర్తిగా రోమాంటిక్ లవ్ స్టోరీ అయ్యి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మితమౌతున్న ఈ సినిమాకు శౌర్య దర్శకత్వం వహిస్తుండగా హెషమ్ అబ్దుల్ వాహిద్ సంగీతం అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com