Nani: సిల్క్ స్మిత పోస్టర్‌తో నాని.. సరికొత్తగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్..

Nani: సిల్క్ స్మిత పోస్టర్‌తో నాని.. సరికొత్తగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్..
Nani: ఈ ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని.

Nani: నేచురల్ స్టార్ నాని కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంతో పాటు వాటిని తొందరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కూడా దిట్ట. కెరీర్ మొదట్లో ఏడాదికి నాలుగు సినిమాలు చేసేవాడు నాని. ఆ తర్వాత సంవత్సరానికి మూడు చిత్రాలు చేయగలిగాడు. ఒక కోవిడ్ తర్వాత నాని స్పీడ్ మరింతగా తగ్గిపోయింది. ఇటీవల నాని అప్‌కమింగ్ మూవీ 'దసరా' రిలీజ్ డేట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

ఈ ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా కోసం మలయాళ ముద్దుగుమ్మ నజ్రియాను ఒప్పించి టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. కానీ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అంతగా మెప్పించలేక యావరేజ్‌గా నిలిచింది. దీంతో తన తరువాతి సినిమాతో అయినా సూపర్ హిట్ టాక్ అందుకోవాలని నాని అనుకుంటున్నాడు.

నాని ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చేస్తున్న 'దసరా' కోసం తన లుక్ దగ్గర నుండి అన్నీ మార్చేశాడు. అంతే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట నిర్మాతలు. అందుకే ఎక్కువ సమయమయినా కూడా సినిమా క్వాలిటీ బాగుండాలని ఈ మూవీని 2023 మార్చి 30న విడుదల చేయాలని నిర్ణయించింది టీమ్. సిల్క్ స్మిత పోస్టర్ ముందు కూర్చున్న నాని పోస్టర్‌తో ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చూసిన వారికి ఇది పీరియాడిక్ డ్రామానేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story