Nani: నాని కెరీర్‌లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..

Nani: సినీ పరిశ్రమలో స్పీడ్‌గా సినిమాలు చేసే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఏడాదికి కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు నాని. అయితే కంటెంట్ బాగుంటే చాలు.. దర్శకుడు అప్‌కమింగ్ అయినా కూడా నాని ఛాన్స్ ఇచ్చేస్తాడు. అలాగే తన కెరీర్‌లో ఎన్నో హిట్లు అందుకున్నాడు. కానీ నాని మొదటిసారి పాన్ ఇండియా దర్శకుడితో సినిమా చేయనున్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది.
నాని ప్రస్తుతం తాను నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. దీని తర్వాత తన కెరీర్‌లో ఎన్నడూ చేయని ఓ మాస్ పాత్రతో 'దసరా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఒక తరహా సినిమాల్లో మాత్రమే నటించే నాని.. ఈమధ్య ప్రయోగాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే పాన్ ఇండియా దర్శకుడితో తన తరువాతి సినిమాను ఓకే చేసినట్టు టాక్.
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాంటి ప్రశాంత్ నీల్‌తోనే నాని సినిమా ఉండబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే.. నాని కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ప్రొడక్షన్ హౌస్.. వీరి కాంబినేషన్ తెరకెక్కే చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com