Nani : టక్ జగదీష్ పై క్లారిటీ..!

X
By - TV5 Digital Team |27 May 2021 3:26 PM IST
Nani : శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్.. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. వాస్తవానికి అయితే ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే మళ్ళీ ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని నేపధ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల పుకార్లు వచ్చాయి. అయితే వీటిపైన చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, వదంతులు నమ్మవద్దంటూ పేర్కొంది. సాహూ గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com