Nani: మొదటిసారి కెమెరా ముందుకు నాని భార్య.. డ్యాన్స్‌తో షాకిచ్చిందిగా..!
Nani: కొందరు స్టార్ హీరోలు.. సినీ పరిశ్రమలో ఎంత పాపులర్ అయినా కూడా.. వారి పర్సనల్ లైఫ్ గురించి మాత్రం పెద్దగా బయటికి రానివ్వరు. ఎప్పుడో ఒకసారి తప్ప తమ కుటుంబ సభ్యలతో ఈవెంట్స్‌కు కూడా రారు. అలాంటి వారిలో ఒకరే నాని. నాని పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పలు విషయాలు తెలిసినా.. తను మాత్రం ఫ్యామిలీతో పెద్దగా ఎప్పుడూ బయట కనిపించలేదు. అలాంటిది నాని భార్య మొదటిసారి డ్యాన్స్‌తో అందరికీ షాకిచ్చింది.
నేచురల్ స్టార్ నాని.. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌కు కూడా టైమ్ కేటాయిస్తాడు. ఇది తన సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతోంది. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి అప్పుడప్పుడు తప్పా ఎక్కువగా షేర్ చేసుకోడు నాని. అలాంటిది ఇటీవల తన పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేశాడు నాని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం 'అంటే సుందరానికీ'. కామెడీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రోమో సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ప్రోమో సాంగ్‌కు నాని.. తన భార్య, నజ్రియాతో కలిసి స్టెప్పులేశాడు. అంతే కాకుండా నెటిజన్లను కూడా ఆ స్టెప్పులేసి పోస్ట్ చేయమని పిలుపునిచ్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com