టాలీవుడ్

Narappa Movie : ఓటీటీ లోనే 'నారప్ప'.. వచ్చేది ఎప్పుడంటే?

Narappa Movie : విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'నారప్ప'.

Narappa Movie  : ఓటీటీ లోనే  నారప్ప.. వచ్చేది ఎప్పుడంటే?
X

Narappa 

Narappa Movie : విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'నారప్ప'. ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.

ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జులై 20న 'నారప్ప' స్ట్రీమింగ్‌ కానుంది. మొదట థియేటర్లో విడుదల చేయాలని భావించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం ఓటీటీవైపే మొగ్గు చూపింది. తమిళ సూపర్‌హిట్‌ 'అసురన్‌' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మించారు. వెంకటేశ్‌ సరసన ప్రియమణి నటించింది. కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ బాణీలు కట్టాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వెంకటేశ్ నటించిన మరో చిత్రం దృశ్యం-2 కూడా ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం సాగింది. అయితే చిత్రయూనిట్ గతంలోనే దీనిపై స్పష్టతనిచ్చింది. దృశ్యం 2 థియేటర్లోనే విడుదల చేస్తామని ప్రకటించింది. నారప్ప విషయంలోనూ అదే జరిగింది. ఊహించని విధంగా ఈ మూవీ ఓటీటీ విడుదల చేస్తున్నారు. నారప్ప సినిమా డిజిటల్ హాక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికే కొనుగోలు చేసినట్లు టాక్. నారప్ప విడుదల తర్వాత మరిన్ని సినిమాలు ఓటీటీ బాటపట్టే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES