Naresh-Pavithra: పెళ్లి పీటలెక్కబోతున్న నరేశ్-పవిత్రా లోకేశ్...

Naresh-Pavithra: పెళ్లి పీటలెక్కబోతున్న నరేశ్-పవిత్రా లోకేశ్...
వివాహబంధంతో ఒక్కటవ్వబోతున్న నరేశ్-పవిత్రా లోకేశ్; అందుకేసమే ట్వీట్ చేశానంటోన్న నరేశ్..

Naresh-Pavithra: వివాదాల సుడిగుండంలో చిక్కుకుని ఎట్టకేలకు తమ మధ్య బంధాన్ని పెళ్లితో బలపరచుకోవాలని నరేశ్ పవిత్రా లోకేశ్ నిర్ణయించుకున్నారు. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నామని ట్విట్టర్ వేదికగా నరేశ్ ప్రకటించారు. ఈమేరకు తమకు అందిరి ఆశీస్సులూ కావాలని కోరారు.


పలు చిత్రాల్లో కలసి నటించిన నరేశ్-పవిత్రా లోకేశ్ కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి బంధం గురించి కొంతకాలం క్రితం నరేశ్ రెండవ భార్య పెద్ద వివాదాన్నే లేవనెత్తారు. నరేశ్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో కలసి జీవిస్తున్నారని ఆమె ఆరోపించారు.


ఈ వివాదాన్ని సున్నితంగా డీల్ చేసిన నరేశ్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు అర్ధమైంది. పెద్దల ఆశీసులతో తామిద్దరం ఒక్కటవ్వబోతున్నాం అని నరేశ్ ట్వీట్ చేశారు. ఇక ఈ జంట పదికాలాలపాటు చల్లగా ఉండాలని కొందరు ట్వీట్ చేస్తుంటే... లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story