Nazriya Nazim: ఆ తెలుగు స్టార్స్‌తో కలిసి నటించాలనుంది: నజ్రియా

Nazriya Nazim: నజ్రియా నాజిమ్.. ఈ పేరు తెలుగుతెరపై మొదటిసారి కనిపిస్తున్నా కూడా.. తన గురించి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. మలయాళ అమ్మాయి అయిన నజ్రియా నటించిన ఒకేఒక్క తమిళ చిత్రం 'రాజా రాణి'. ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్‌తో విడుదలయ్యింది. అప్పుడే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇక ఇన్నాళ్లకు తెలుగులో నేరుగా ఎంట్రీ ఇస్తూ అందరినీ మెప్పించడానికి సిద్ధమవుతోంది.
నేచురల్ స్టార్ నాని ఇప్పటికీ ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నజ్రియా కూడా చేరింది. నాని, నజ్రియా కాంబినేషన్‌లో వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన 'అంటే.. సుందరానికీ' చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది నజ్రియా.
కథ నచ్చకపోతే.. ఎన్ని సంవత్సరాలైనా సినిమాలకు దూరంగా ఉండే నజ్రియా.. అంటే.. సుందరానికీ కథను ఇష్టపడింది. ఇక దీని తర్వాత తెలుగులో ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్‌లాంటి హీరోలతో కూడా తనకు నటించాలని ఉందని బయటపెట్టింది నజ్రియా. అంతే కాకుండా తమిళంలో కూడా అజిత్ లాంటి స్టార్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటోంది. మరి అంటే సుందరానికీ సక్సెస్.. నజ్రియాకు ఎన్ని ఆఫర్లను తెచ్చిపెడుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com