NBK 107: ఎన్‌బీకే 107.. ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

NBK 107: 'అఖండ' విజయం బాలయ్యలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తనతో పాటు తన ప్రేక్షకుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే బాలయ్య అభిమానులంతా తన తరువాతి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అఖండ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగానే బాలయ్య తన తరువాతి సినిమాను వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డారు.
తెలుగులో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని.. తన తరువాతి సినిమాను బాలయ్యతో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌గా ఉంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్ ఇప్పటికే విడుదల కాగా.. గ్లింప్స్ విడుదలకు కూడా డేట్ ఫిక్స్ అయినట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనికి తగినట్టుగా ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.
జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గ్లింప్స్ కాకపోయినా టీజర్, అప్డేట్ లాంటిది ఏదో ఒకటి రిలీజ్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇక బాలయ్య పుట్టినరోజుకు తమకు ట్రీట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com