NBK 107: ఎన్‌బీకే 107 ఫస్ట్ హంట్ రిలీజ్.. సింహంలా గర్జించిన బాలయ్య..

NBK 107: ఎన్‌బీకే 107 ఫస్ట్ హంట్ రిలీజ్.. సింహంలా గర్జించిన బాలయ్య..
NBK 107: ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంది ఎన్‌బీకే 107 గ్లింప్స్. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సింహంలాగా గర్జించాడు బాలయ్య.

NBK 107:జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా.. గోపీచంద్ మలినేనితో తాను చేస్తున్న సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే పుట్టినరోజుకు ఒకరోజు ముందే అభిమానులకు అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చాడు బాలయ్య. ఎన్‌బీకే 107 నుండి ఫస్ట్ హంట్ పేరుతో ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రమే 'ఎన్‌బీకే 107'. 'అఖండ' విజయం బాలయ్యలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తనతో పాటు తన ప్రేక్షకుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే బాలయ్య అభిమానులంతా తన తరువాతి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఎన్‌బీకే 107పై అంచనాలే పెరిగిపోయాయి.

ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంది ఎన్‌బీకే 107 గ్లింప్స్. ఎప్పటిలాగానే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సింహంలాగా గర్జించాడు బాలయ్య. డైలాగ్స్‌లో తన మార్క్ కనిపించేలా జాగ్రత్తపడ్డాడు గోపీచంద్ మలినేని. ఇక మరోసారి తమన్, బాలయ్య కాంబినేషన్ థియేటర్లలో అరుపులు పుట్టించేలా అనిపిస్తోంది. గ్లింప్స్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్త ఊపును ఇచ్చింది.


Tags

Read MoreRead Less
Next Story