నిహారిక పెళ్లి రోజు అందుకున్న ప్రేమ సందేశం.. నీతో గడిపిన ప్రతిక్షణం..

నిహారిక పెళ్లి రోజు అందుకున్న ప్రేమ సందేశం.. నీతో గడిపిన ప్రతిక్షణం..
ముఫ్పైఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది.

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం.. బంధాల్ని ముడివేస్తుంది.. బాధ్యతల్ని గుర్తుచేస్తుంది.. అనుబంధాల పందిరిలో దంపతులు అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు. వారి మధ్య అల్లుకున్న ఆత్మీయ అనురాగ మాలిక కుటుంబ వృద్ధికి తోడ్పడుతుంది. ఎన్ని ఆనందాలు మోసుకొచ్చినా పెళ్లిపందిరి ఉద్వేగభరిత క్షణాలకు వేదిక అవుతుంది. నిహారిక తన పెళ్లి వేడుక సమయంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పొందుపరిచారు.

పెళ్లికుమార్తెగా ముస్తాబవుతున్న సమయంలో నిహారిక కాబోయే భర్త చైతన్య నుంచి ఓ ప్రేమ సందేశాన్ని అందుకుంది. 'ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకు గుర్తుపెట్టుకుంటాను. ముఫ్పైఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది అంటూ చైతన్య రాసి పంపించిన లేఖ చూసి నిహారిక కంటతడి పెట్టింది.

కళ్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ధ కుమార్తె సుస్మితను హత్తుకుని నిహారిక ఉద్వేగానికి లోనయ్యారు. అంతే కాకుండా ఈ పెళ్లి వేడుకలో మరిన్ని మరపురాని జ్ఞాపకాలు, ఆనంద భరిత క్షణాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story