Nijam With Smitha: నెపోటిజం పై భిన్నాభిప్రాయాలు

Nijam With Smitha: నెపోటిజం పై భిన్నాభిప్రాయాలు
ప్రేక్షకుల వల్లే నెపోటిజం: నానీ కీలక వ్యాఖ్యలు; కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిందే: రానా...

చూడబోతే నెపోటిజంపై రగడ మళ్లీ మొదలైందేమో అనిపిస్తోంది. అటు బాలీవుడ్ కంగన రౌనత్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరించడంతో సినీవారసులపై మళ్లీ ఒంటికాలి మీద చిందులు తొక్కడం మొదలుపెట్టింది. ఆలియాభట్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడంపై దుమ్మెత్తిపోస్తోంది. ఈ వారసులు అసలైన ప్రతిభావంతుల నుంచి అవార్డులు కాజేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ వేడి చల్లారక ముందే టాలీవుడ్ లోనూ నెపోటిజం పై చర్చ మళ్లీ మొదలైంది. ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన ్న నిజం విత్ స్మిత కార్యక్రమం తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలవ్వడంతో చాలా రోజుల తరువాత నెపోటిజం అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నానీ, దగ్గుబాటి రానా అతిథులుగా విచ్చేశారు. ఇక నెపోటజంపై ఇరువురూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అసలు ప్రేక్షకుల వల్లే సినీ వారసులకు ఎక్కువ ఆదారణ లభిస్తోందని నానీ అభిప్రాయపడ్డాడు. తన సినిమాను లక్షమంది చూస్తే, రామ్ చరణ్ సినిమాను కోటి మంది చూస్తారని అన్నాడు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల వారసులను చూసేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు కాబట్టే నెపోటిజం వర్ధిల్లుతోందని స్పష్టం చేశాడు. మరోవైపు రానా తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించలేకపోతే అది కుటుంబ పట్ల చేస్తున్న ద్రోహమేనని అన్నాడు. ఓ నటుడికి తన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం అనివార్యమని రానా అభిప్రాయపడ్డాడు. అయితే వారసులు తల్లిదండ్రుల బాటల ో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story