Nithiin: 'కథ బాగా రాలేదనే ఆ సినిమా ఆగిపోయింది'.. నితిన్ అప్‌కమింగ్ మూవీపై క్లారిటీ..

Nithiin: కథ బాగా రాలేదనే ఆ సినిమా ఆగిపోయింది.. నితిన్ అప్‌కమింగ్ మూవీపై క్లారిటీ..
Nithiin: ఒకేసారి ‘మాచర్ల నియోజకవర్గం’, ‘పవర్ పేట’ అనే రెండు చిత్రాలను అనౌన్స్ చేశాడు నితిన్.

Nithiin: ఒకానొక సందర్భంలో యంగ్ హీరో నితిన్ స్పీడ్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. కోవిడ్ తర్వాత నితిన్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలోనే తన రెండు చిత్రాలు 'చెక్', 'రంగ్ దే' చిత్రాలను విడుదల చేశాడు నితిన్. కానీ ఇందులో ఒకటి ఫ్లాప్ అవ్వగా మరొకటి యావరేజ్‌గా నిలిచింది. అయితే నితిన్ నటించాల్సిన మరో సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన రాకపోవడంతో తన తండ్రి.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

రెండు సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత నితిన్.. తన తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఒకేసారి 'మాచర్ల నియోజకవర్గం', 'పవర్ పేట' అనే రెండు చిత్రాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటైన మాచర్ల నియెజకవర్గం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ పవర్ పేట గురించి మాత్రం ఇంకా ఏ అప్డేట్ లేదు. దీంతో నితిన్ తండ్రి ఈ మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు.

రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కాల్సిన పవర్ పేట చిత్రం ఆగిపోయిందని స్పష్టం చేశారు నితిన్ తండ్రి. కథ ఫైనల్ వర్షన్ బాగా రాలేదని.. అందుకే ఆ సినిమా ఆగిపోయిందని తెలిపారు. అయితే కొన్నాళ్ల క్రితం నితిన్.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శర్వానంద్‌తో ఈ సినిమా చేయాలని డైరెక్టర్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చినా.. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

Tags

Read MoreRead Less
Next Story