Nithiin: ఇదేం ట్విస్ట్..! సీరియల్స్‌లో నటించనున్న నితిన్..
Nithiin: యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. లాక్‌డౌన్ తర్వాత నితిన్ చేసినంత స్పీడ్‌గా మరే ఇతర యంగ్ హీరోలు సినిమాలు చేయలేదు. ఒక్క ఏడాదిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. అందులో 'చెక్' సినిమా డిసాస్టర్ అవ్వగా.. 'రంగ్ దే' యావరేజ్‌గా నిలిచింది. ఇక చివరిలో 'మేస్ట్రో' చిత్రాన్ని ఏకంగా ఓటీటీలో విడుదల చేశాడు నితిన్. అది కూడా పరవాలేదనిపించింది. అందుకే మాచర్ల నియెజకవర్గం ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని నితిన్ ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'మాచర్ల నియోచకవర్గం' అనే చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమాతో మొదటిసారి తాను పొలిటికల్ జోనర్‌ను టచ్ చేస్తున్నాడు. ఇందులో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా.. తెలుగమ్మాయి అంజలి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
మాచర్ల నియోజకవర్గం.. ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా నెల సమయం ఉన్నా.. మూవీ టీమ్ మాత్రం అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగానే నితిన్.. పలు సీరియల్స్‌లో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సీరియల్స్‌లో సినిమావారు ప్రమోషన్ ఇవ్వడం అనేది కొత్తేమీ కాదు. కానీ గతకొంతకాలంగా ఈ కల్చర్ కనిపించడం లేదు. నితిన్.. మళ్లీ ఈ కల్చర్‌ను తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది. మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్స్ కోసం నితిన్.. బుల్లితెరపై మెరవనున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com