Nithiin: మెగాస్టార్ సినిమాలో నితిన్.. ఇంట్రెస్టింగ్ పాత్రలో యంగ్ హీరో..

Nithiin: మెగాస్టార్ సినిమాలో నితిన్.. ఇంట్రెస్టింగ్ పాత్రలో యంగ్ హీరో..
Nithiin: రంజీవి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కూడా నితిన్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్త వైరల్‌గా మారింది.

Nithiin: ఈమధ్య యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు కలిసి నటించడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఇలాంటి కాంబినేషన్స్‌కు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే మేకర్స్ కూడా సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల కోసం యంగ్ హీరోలను సంప్రదిస్తున్నారు. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కూడా నితిన్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్త వైరల్‌గా మారింది.

చిరంజీవి ప్రస్తుతం 'భోళా శంకర్', 'గాడ్ ఫాదర్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో యంగ్ హీరో నితిన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇందులో నితిన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని సమాచారం.

భోళా శంకర్‌లో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే కీర్తి సురేశ్ భర్తగా నితిన్ కనిపించనున్నట్టు టాక్. ఇప్పటికే నితిన్, కీర్తి సురేశ్ కలిసి 'రంగ్ దే' చిత్రంతో అలరించారు. ఈ మూవీలో వీరి పెయిర్ చాలా రిఫ్రెషింగ్ ఉందని ప్రేక్షకులు భావించారు. ఇక మరోసారి కీర్తితో జోడీకట్టి మెప్పించనున్నాడు నితిన్. ఈ రూమర్ నిజమే అని దాదాపు ఖరారైనా.. దీని గురించి మూవీ టీమ్ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.



Tags

Read MoreRead Less
Next Story