Nithiin: 'జయం' సినిమాకు 20 ఏళ్లు.. నితిన్ ఎమోషనల్ పోస్ట్..

Nithiin: జయం సినిమాకు 20 ఏళ్లు.. నితిన్ ఎమోషనల్ పోస్ట్..
Nithiin: జయం సినిమాతో హీరోగా పరిచయమయిన నితిన్.. ఆ తర్వాత ఎన్నో యూత్‌ఫుల్ సినిమాల్లో నటించాడు.

Nithiin: నటీనటులకు అయినా.. దర్శకులకు అయినా.. ఫస్ట్ సినిమా అనేది చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. ఆ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అది ఎప్పటికీ వారికి ఓ మంచి జ్ఞాపకమే. ఇక టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నితిన్‌కు అలాంటి సినిమా 'జయం'. నేటికి జయం సినిమా విడుదలయ్యి 20 ఏళ్లు అవుతుండడంతో నితిన్.. ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.

జయం సినిమాతో హీరోగా పరిచయమయిన నితిన్.. ఆ తర్వాత ఎన్నో యూత్‌ఫుల్ సినిమాల్లో నటించాడు. ఫ్యామిలీ కథలను ఎంచుకునే అందరికీ దగ్గరయ్యాడు. కానీ అలాంటి నితిన్ కెరీర్ కూడా మధ్యలో కాస్త తడబడింది. కొన్నేళ్ల వరకు నితిన్ ఏ సినిమా చేసినా ఫ్లాప్‌గానే నిలిచింది. అలాంటి తనకు 'ఇష్క్' చిత్రం మళ్లీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న నితిన్.. జయం సినిమా రోజులను మరోసారి గుర్తుచేసుకున్నాడు.

'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా జయంతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నేను ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పడం కష్టం కానీ ప్రయత్నిస్తాను. ముందుగా నాలోని నటుడిని గుర్తించి నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చినందుకు డైరెక్టర్ తేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. నేను పనిచేసిన ప్రతీ సినిమా దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్న ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండి.. నన్ను నమ్ముతూ సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్. మీ ప్రేమే నన్ను ముందుకు నడిపించింది. ఇక నాపై నమ్మకం పెట్టుకున్న నా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని పోస్ట్ చేశాడు నితిన్.



Tags

Read MoreRead Less
Next Story