Nithya Menen: 'భీమ్లా నాయక్' ప్రమోషన్స్‌కు నిత్యా మీనన్ దూరం.. కారణం ఇదేనా..?

Nithya Menen: ప్రస్తుతం టాలీవుడ్‌లో 'భీమ్లా నాయక్' మ్యానియా నడుస్తోంది. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. ప్రేక్షకులంతా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ ఓపెన్ చేయగానే నిమిషాల వ్యవధిలోనే టికెట్లు బుక్ అయిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో భాగమైన అందరూ భీమ్లా నాయక్ కోసం ఎంతోకొంత ప్రమోషన్స్ చేస్తు్న్నారు. నిత్యా మీనన్ తప్ప..
నిత్యా మీనన్ ఒక సినిమాలో నటిస్తుంది అంటే.. అందులో తనకు నచ్చిన ఎలిమెంట్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అంతే కాకుండా ప్రాధాన్యత లేని పాత్రల జోలికి నిత్యామీనన్ వెళ్లదు. అందుకే భీమ్లా నాయక్‌లాంటి చిత్రంలో తనకు వచ్చిన ఛాన్స్‌ను నిత్యా వదులుకోలేదు. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నటించిన నిత్యా.. తనదైన పవర్‌ఫుల్ యాక్షన్‌ను కనబరిచినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది
అయితే నిత్యా మీనన్ మాత్రం భీమ్లా నాయక్ గురించి పెద్దగా స్పందించట్లేదు. ట్రైలర్ రిలీజ్ అప్పుడు కానీ తన సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఏమీ ప్రస్తావించలేదు నిత్యా. పైగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా నిత్యా పాల్గొనకపోవడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది.
అయితే భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలోనే నిత్యా మీనన్‌తో మూవీ టీమ్‌కు విభేదాలు వచ్చాయని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిత్యా మీనన్ క్యారెక్టర్ గురించి ప్రశంసించడం వల్ల నిత్యాకు ఎలాంటి విభేదాలు లేవని, ఇతర షెడ్యూల్స్‌లో బిజీగా ఉండడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదని మరికొందరు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com