Nithya Menen: అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు: నిత్యామీనన్

Nithya Menen: సినీ పరిశ్రమలో కాంట్రవర్సీలు, రూమర్స్ సహజం. వాటన్నింటికి దూరంగా ఉండాలనుకోవడం కష్టం. అయినా కూడా దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయే నటీనటులు కూడా ఉన్నారు. అందులో ఒకరు నిత్యామీనన్. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ, తనకు నచ్చకపోతే ఎంతటి స్టార్ సినిమాలు అయినా రిజెక్ట్ చేస్తూ కెరీర్‌ను సాగిస్తోంది నిత్యా. అయితే తాజాగా తొలిసారి తనపై జరిగిన వేధింపులపై నోరువిప్పింది ఈ నటి.
నిత్యామీనన్ ఇటీవల 19(1)(a) అనే మలయాళ చిత్రంలో నటించింది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలయ్యి పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను బటయపెట్టింది నిత్యా. ఒక మూవీ రివ్యూలు ఇచ్చే వ్యక్తి తనను ఆరేళ్లుగా వేధిస్తున్నాడనే విషయాన్ని బయటపెట్టింది నిత్యా. ప్రొఫెషనల్‌గానే కాకుండా పర్సనల్‌గా కూడా తనని టార్గెట్ చేశాడని చెప్పుకొచ్చింది.
అతడు చెప్పే మాటలు నమ్మినవారిని ఫూల్స్ అని కొట్టిపారేసింది నిత్యామీనన్. అతడు వైరల్ అయిన తర్వాత ధైర్యంగా తన దగ్గరికి వచ్చి మాట్లాడాడని చెప్పింది. తన వేధింపులు భరించలేక పోలీస్ కేసు పెట్టమని తన సన్నిహితులు సలహా ఇచ్చారని తెలిపింది నిత్యా. తనకు మాత్రమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడని చెప్పింది. దాదాపు అతడికి సంబంధించిన 30 ఫోన్ నెంబర్లను తను బ్లాక్ చేసినట్టుగా తెలిపింది. అయినా కూడా నిత్యామీనన్.. అతడి పేరును మాత్రం బయటపెట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com