Nithya Menen: బ్రేక్ తీసుకుంటున్నాను కానీ పెళ్లి కోసం కాదు: నిత్యా మీనన్

Nithya Menen: బ్రేక్ తీసుకుంటున్నాను కానీ పెళ్లి కోసం కాదు: నిత్యా మీనన్
X
Nithya Menen: ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది.

Nithya Menen: మామూలుగా ఒక హీరో లేదా హీరోయిన్ గురించి పెళ్లి వార్తలు మొదలయ్యాయి అంటే అవి కాస్త సమయంలోనే వైరల్ అయిపోతాయి. కానీ హీరోహీరోయిన్లు స్పందించేవరకు అవి నిజమా కాదు ఎవరికీ తెలియదు. ఇటీవల నిత్యామీనన్ పెళ్లి గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. కానీ వెంటనే అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. ఇప్పుడేమో సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మామూలుగా సినీ పరిశ్రమలో నటీనటులపై రూమర్స్ అనేవి కామన్. అసలు ఎలాంటి రూమర్స్ రాకుండా ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది నిత్యా. కానీ తాజాగా ఓ మలయాళ స్టార్ నటుడిని నిత్యా పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదని ఒక్కరోజులోనే తేల్చి చెప్పేసింది. సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదని తేల్చేసింది.


ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్ పెళ్లి గురించి కాదని, మామూలుగానే సినిమాల షూటింగ్స్ తర్వాత తను బ్రేక్ తీసుకుంటూ ఉంటుందని తెలిపింది. గత ఏడాదిగా తాను ఒక్కరోజు కూడా తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాని చెప్పింది. ఇక నిత్యా నటించిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Tags

Next Story