Nivetha Pethuraj: అవకాశాలు రాకపోతే అదే పని చేస్తా.. నాకు సత్తా ఉంది: నివేదా పేతురాజ్

Nivetha Pethuraj: కొందరు హీరోయిన్లకు గ్లామర్, టాలెంట్ అన్నీ ఉన్నా కూడా లక్ మాత్రం సహకరించదు. అందుకే చేసిన సినిమాలు దాదాపు హిట్ అయినా కూడా అవకాశాలు మాత్రం రావు. అలాంటి హీరోయిన్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అందులో ఒకరు నివేదా పేతురాజ్. తాజాగా నివేదా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ముందుగా తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది నివేదా. 'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది. ఆ తర్వాత కూడా పలు యూత్‌ఫుల్ సినిమాలతో పలకరించింది. అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురంలో' చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది నివేదా.
నివేదా పేతురాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తను హీరోయిన్ అనిపించుకోవడంకంటే నటి అనిపించుకోవడమే సంతోషమని స్పష్టం చేసింది. చాలామంది హీరోయిన్‌గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదని చాలా భయపడుతూ ఉంటారు, తనకు అలాంటి భయాలు ఏమీ లేవని చెప్పింది నివేదా. తనకు నటన పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదని, నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అయితే తనకు అవకాశాలు రానప్పుడు ఉద్యోగం అయినా చేసుకుంటానని, తనకు ఆ సత్తా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నివేదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com