NTR 30: ఎన్‌టీఆర్, కొరటాల సినిమా.. ఏకంగా 9 భాషల్లో..

NTR 30: ఎన్‌టీఆర్, కొరటాల సినిమా.. ఏకంగా 9 భాషల్లో..
NTR 30: ఇప్పటికే కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే చిత్రం తెరకెక్కింది.

NTR 30: ఒక్కసారి పాన్ ఇండియా సినిమా చేసి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఆ హీరో చేసే తర్వాత చిత్రాలు కూడా పాన్ ఇండియా అవ్వాలని అనుకుంటారు ఫ్యాన్స్. అంతే కాకుండా మేకర్స్ కూడా ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ఎన్‌టీఆర్.. తన అప్‌కమింగ్ మూవీని కేవలం తెలుగులోనే విడుదల చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయినట్టుగా తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్‌టీఆర్ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ చిత్రంతో హాలీవుడ్ స్టార్ మేకర్స్‌ను సైతం ఇంప్రెస్ చేశాడు ఈ హీరో. ఇక ఈ మూవీ తర్వాత కాస్త బ్రేక్‌లో ఉన్న ఎన్‌టీఆర్.. త్వరలోనే కొరటాలతో చేయనున్న చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నాడు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ 30కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరిగిపోతున్నాయి.

ఇప్పటికే కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' అనే చిత్రం తెరకెక్కింది. ఇది కేవలం తెలుగులోనే విడుదలయ్యి సూపర్ హిట్ సాధించింది. అలాగే ఎన్‌టీఆర్ 30 కూడా కేవలం తెలుగులోనే విడుదల చేయాలని కొరటాల అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్‌టీఆర్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మొత్తం 9 భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్‌టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది.

Tags

Next Story