NTR: 'కొమురం భీం' పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్‌లో కథనం..

NTR: కొమురం భీం పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్‌లో కథనం..
NTR: 'ఆర్ఆర్ఆర్‌'లో హీరోలుగా నటించిన ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. ఒక్క చిత్రంతోనే గ్లోబర్ స్టార్స్ అయిపోయారు.

NTR: ఆస్కార్ అనేది సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. ఇప్పటివరకు ఆస్కార్ అందుకున్న ఇండియన్ సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. హాలీవుడ్ లాంటి దిగ్గజ సినీ పరిశ్రమ కూడా ఇండియన్ సినిమాలపై కన్నేసింది. అక్కడ దర్శకులు కూడా ఇండియన్ చిత్రాలను ప్రశంసిస్తున్నారు. ఇక ఒక తెలుగు సినిమా హీరోకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందంటూ ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కథనం రాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా భాషా సరిహద్దులు దాటి ఎంతోమంది ప్రేక్షకులను చేరుకుంది. ఇక ఓటీటీ అనేది ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ వారికి మరింత దగ్గర చేసింది. హాలీవుడ్ దర్శకులలో ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగిపోతోంది. ఇక ఇందులో హీరోలుగా నటించిన ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. ఒక్క చిత్రంతోనే గ్లోబర్ స్టార్స్ అయిపోయారు.

ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్ చేసిన కొమురం భీం పాత్రకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని వెరైటీ అనే హాలీవుడ్ మ్యాగజైన్ రాసుకొచ్చింది. ఇటీవల విడుదలయిన సినిమాలు, అందులో ఆస్కార్ అవార్డు దక్కించుకోగలిగే పర్ఫార్మెన్స్ గురించి రాసుకొచ్చిన ఈ మ్యాగజైన్.. ఇందులో ఎన్‌టీఆర్ గురించి కూడా ప్రస్తావించింది. దీంతో నిజంగానే ఇది నిజమయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ మ్యాగజైన్ ఆర్టికల్‌తో ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది అని విమర్శించిన వారి నోళ్లు మూతబడ్డాయి.



Tags

Read MoreRead Less
Next Story