టాలీవుడ్

Jr NTR: ఫ్యాన్స్‌కు ఎన్‌టీఆర్ లెటర్.. అందరికీ థ్యాంక్స్, సారీ అంటూ..

Jr NTR: నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు.. అందరికీ విషెస్ తెలిపినందుకు ధన్యవాదాలు.

Jr NTR: ఫ్యాన్స్‌కు ఎన్‌టీఆర్ లెటర్.. అందరికీ థ్యాంక్స్, సారీ అంటూ..
X

Jr NTR: సినీ పరిశ్రమలో అభిమాన హీరో పుట్టినరోజు అయితే చాలు.. దానిని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ ప్రేమకు లిమిట్స్ ఉండవు అంటుంటారు కొందరు హీరోలు. అలాగే మే 20న ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ పలుచోట్ల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ విషెస్ తెలిపారు. వారందరి కోసం ఎన్‌టీఆర్ ఓ లేఖను విడుదల చేశాడు.

ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అంతే కాకుండా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా తనకు విషెస్‌ను తెలియజేశారు. అయితే తన పుట్టినరోజున తనకోసం వచ్చిన ఫ్యాన్స్‌ను కలవలేకపోయినందుకు వారికి సారీ చెప్పాడు తారక్.

'నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు అందరికీ విషెస్ తెలిపినందుకు ధన్యవాదాలు. అలాగే నాకు విషెస్ తెలపడానికి చాలా దూరం నుండి వచ్చిన ఫ్యాన్స్‌కు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మీ ప్రేమ నా పుట్టినరోజును ఎంతో స్పెషల్‌గా చేయడంతో పాటు నా మనసును కదిలించింది. నేను ఇంట్లో లేనందున్న మిమ్మల్ని కలవలేకపోయాను. సారీ. మీ ప్రేమకు, ఆశీస్సులకు నేనెప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఈ రుణం తీర్చుకోలేను' అని ట్వీట్ చేశాడు ఎన్‌టీఆర్.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES