టాలీవుడ్

Bimbisara Movie: 'బింబిసార'పై ఎన్‌టీఆర్ ట్వీట్.. చాలా సంతోషంగా ఉందంటూ..

Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటించారు.

Bimbisara Movie: బింబిసారపై ఎన్‌టీఆర్ ట్వీట్.. చాలా సంతోషంగా ఉందంటూ..
X

Bimbisara Movie: ఆగస్ట్‌లో సినిమా సందడి మొదలయ్యింది. జులైలో విడుదలయిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌కు అంతగా లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో మూవీ లవర్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ ఆగస్ట్ మొదటివారంలోనే విడుదలయిన రెండు సినిమాలు హిట్ టాక్ అందుకుంటూ ఉండడంతో మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అందులో ఒకటి 'బింబిసార'.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటించారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన భిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్లారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార' కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రమే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. దీనిపై ఎన్‌టీఆర్ స్పందించారు.

'బింబిసార గురించి గొప్పగా వింటున్నాను. మనం మొదటిసారి చూసిన విధంగానే అందరూ అదే ఉత్సాహంతో ఒక సినిమాను చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్న బింబిసారగా నిన్ను తప్పా ఎవరినీ ఊహించుకోలేము. డైరెక్టర్ వశిష్ట అనుభవం ఉన్నవారిలాగా సినిమాను నడిపించారు. కీరవాణిగారు బింబిసారకు వెన్నుముుకగా నిలిచారు.' అంటూ యాక్టర్లను, టెక్నిషియన్స్‌ను ప్రశంసించారు ఎన్‌టీఆర్.


బింబిసార మూవీ సక్సెస్ అవ్వడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్‌లో తనను నమ్మి ముందుగా సినిమా బాగుందని చెప్పిన తన తమ్ముడు ఎన్‌టీఆర్‌కు లవ్యూ చెప్పారు కళ్యాణ్ రామ్

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES