Bimbisara Movie: 'బింబిసార' ప్రీమియర్ చూసిన ఎన్‌టీఆర్.. రివ్యూ ఏంటంటే..?

Bimbisara Movie: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. కమర్షియల్ సినిమాలు కాకుండా ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు కళ్యాణ్ రామ్. కెరీర్ మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకున్నా కూడా ఆ తర్వాత వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. మళ్లీ కమర్షియాలిటీ వైపు వచ్చేసిన ఈ హీరో.. 'బింబిసార'తో తన కెరీర్‌లోనే ఓ కొత్త రకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బింబిసార' కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం. అంతే కాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ దయలేని రాజుగా కనిపించనున్నాడని ఇప్పటికే అర్థమవుతోంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, క్యాథరీన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల నిర్మాతతో కలిసి ఎన్‌టీఆర్.. బింబిసార ప్రీమియర్ చూశారట.
బింబిసార చూసిన తర్వాత కళ్యాణ్ రామ్‌తో పాటు మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపించారట ఎన్‌టీఆర్. కళ్యాణ్ రామ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే.. దర్శకుడు వశిష్ట్ మూవీని విజువల్ వండర్‌గా ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారట. అంతే కాకుండా మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారట. ఇక బింబిసార ఆగస్ట్ 5న తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది.
Along with NTR & top Producer (Distributor) had watched the special Premiere of Kalyan Ram's #Bimbisara
— TrackTollywood (@TrackTwood) July 20, 2022
They are very confident on the films success.#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com