Ongole : బాలయ్యకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం...

శుక్రవారం ఒంగోలులో వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి హీరో బాలాకృష్ణ హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి హెలికాప్టర్‌లో వెళ్లిన విజువల్స్ అభిమానులకు నయనానందాన్ని పంచాయి. ఇక కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తున్న బాలయ్య అనుకోని ఉపద్రవం నుంచి బయటపడ్డారు.
ఒంగోలు నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురైనట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తం అయిన హెలికాప్టర్‌ను ఒంగోల్ లోని పోలీస్ గ్రౌండ్‌లో ఆకస్మిక ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ఘటనలో బాలయ్యకు గానీ, ఇతర సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాలయ్య రోడ్దు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com