Oscar 2023: ఆస్కార్ కు వెళ్లివచ్చేందుకు ఎంత ఖర్చైందో తెలుసా....

Oscar 2023: ఆస్కార్ కు వెళ్లివచ్చేందుకు ఎంత ఖర్చైందో తెలుసా....
సొంత ఖర్చులతో ఆస్కార్ కు వెళ్లివచ్చిన రాజమౌళి అండ్ కో....

మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఆస్కార్ సమేతంగా విజయగర్వంతో తిరిగివచ్చింది. అంతర్జాతీయ మీడియాను సైతం ఓ ఊపు ఊపేసిన రాజమౌళి అండ్ కో... ఈ విజయ యాత్ర కోసం గట్టిగానే ఖర్చుపెట్టారని వినికిడి. అంటే, మరో ఉద్దేశంలో అనుకునేరు. ఆస్కార్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు మన దర్శక ధీరుడకి భారీగానే గండిపడిందని తెలుస్తోంది. విషయం ఏమిటంటే ఆస్కార్ నిర్వాహకులు కేవలం అవార్డీలతో పాటూ మరోక కుటుంబ సభ్యునికి మాత్రమే ఉచిత పాస్ లు జారీ చేస్తారు. అలా కీరవాణి, చంద్రబోస్ కు మాత్రమే ఉచిత పాస్ లు లభించగా, మిగిలిన వారు పాస్ లు కొనుక్కుని వెళ్లాల్సి వచ్చిందిట. ఇందుకు గానీ, రాజమౌళి తనతో పాటూ ముఖ్యమైన వారి కోసం రూ. 20లక్షలు వెచ్చించి మరీ పాస్ లు తీసుకున్నాడట. అంతేకాదు ఆస్కార్ సభలో ఆఖరి లైన్ కాస్త తక్కువకు వస్తుంది కాబట్టి, తమ బృందానికి అవే సీట్లు బుక్ చేసుకున్నారట. అలా సొంతఖర్చులతో ఆస్కార్ కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఏమైనా ఖర్చు సంగతి ఎలా ఉన్న ఆస్కార్ దక్కింది అదే పదివేలు....


Tags

Read MoreRead Less
Next Story