Oscars 2023: తేనెలొలుకు తెలుగులో ప్రతి అక్షరం సంగీతమే – చంద్రబోస్
X
By - Chitralekha |14 March 2023 3:53 PM IST
ఆస్కార్ అందుకున్న తరువాత చంద్రబోయ్ హృద్యమైన మాటలు
అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తా చాటిన సరస్వతీ పుత్రుడు చంద్రబోస్... ఆస్కార్ విజయాన్ని తెేటతెలగుకు అంకితం చేశారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన మాతృభాషపై తన మమకారాన్ని చాటుకున్నారు. ‘అస్కార్‌ను అందుకున్న తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘ తెలుగు భాషలో 56 అక్షరాలు ఉంటాయి. తెలుగులోని చిన్న పదం కూడా సంగీతంలాగానే ఉంటుంది. అందుకే నేను రాసిన పాట అందరికి అర్థం అయినా అవ్వకపోయినా ప్రపంచానికి అంతగా నచ్సేసింది. అది తెలుగు భాష గొప్పతనం. ఆ పాటలో రాసిన ప్రతి పదం చిన్నతనం నుంచి నేను అనుభవించిన జీవితంలోనుంచి పుట్టిన పదాలే ’’ అంటూ చంద్రబోస్ చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తపన ఆయన ప్రతి మాటలోనూ ప్రతిధ్వనిస్తోందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com