Liger OTT: అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి 'లైగర్'.. దానికోసం భారీ డీల్..

Liger OTT: అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి లైగర్.. దానికోసం భారీ డీల్..
Liger OTT: ఇప్పటికే లైగర్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.

Liger OTT: భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుని, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'లైగర్'. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. విడుదలయిన మొదటిరోజు ఫస్ట్ డే నుండే ప్రేక్షకులు దీనికి నెగిటివ్ టాక్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో తర్వాత సినిమా చూద్దామనుకున్నవారు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం లైగర్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులు పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఓటీటీ సంస్థలు ఈ సినిమాకు భారీ ఆఫర్‌తో ముందుకొస్తు్న్నాయి.

ఓటీటీ అనేవి థియేటర్లలో సినిమాలు నడిచే కాలాన్ని తగ్గించేస్తున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లకు నష్టం కలుగుతుంది. అందుకే సినిమా విడుదలయిన 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయినా కూడా థియేటర్లలో సక్సెస్ అవ్వని సినిమా ఓటీటీలో వెంటనే విడుదల అవుతూ వస్తోంది. ప్రస్తుతం లైగర్ పరిస్థితి కూడా అంతే అని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే లైగర్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అయితే అనుకున్న సమయంకంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయడం కోసం రూ.10 కోట్లు అదనంగా ఆఫర్ చేస్తోందట ఈ సంస్థ. ఎలాగో థియేటర్లలో లైగర్ రన్ అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ ఓటీటీ డీల్‌ను నిర్మాతలు ఒప్పుకుంటారేమో అని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story