Pakka Commercial Trailer: గోపీచంద్ బర్త్‌డే స్పెషల్.. 'పక్కా కమర్షియల్' ట్రైలర్ రిలీజ్..

Pakka Commercial Trailer: తెలుగులో ముందుగా విలన్‌గా పరిచయమయ్యి.. తన విలనిజంతోనే ప్రేక్షకులను భయపెట్టాడు గోపీచంద్. ఆ తర్వాత తన కటౌట్‌కు హీరో రోల్స్ సూట్ అవుతాయని మేకర్స్.. తనను హీరోగా మార్చారు. కమర్షియల్, యాక్షన్ కథలతో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు గోపీచంద్. ఇక ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ 'పక్కా కమర్షియల్' ట్రైలర్‌ను లాంచ్ చేసింది టీమ్.
గోపీచంద్ చివరి చిత్రం 'సీటీమార్' పరవాలేదనిపించింది. ఇక ప్రస్తుతం తాను పక్కా కమర్షియల్‌తో పాటు శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేస్తున్నాడు. వీటితో పాటు తన పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త మూవీని కూడా అనౌన్స్ చేశాడు గోపీచంద్. ఈ రెండిటిలో ముందుగా పక్కా కమర్షియల్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది. జులై 1న విడుదల కావాల్సిన పక్కా కమర్షియల్ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది.
మారుతి డైరెక్షన్‌లో గోపీచంద్, రాశి ఖన్నా నటిస్తున్న చిత్రమే 'పక్కా కమర్షియల్'. కమర్షియల్ కథలకు ఫన్‌ను జోడించి చిత్రాలను తెరకెక్కించడం మారుతి స్టైల్. పక్కా కమర్షియల్ చిత్రం కూడా అలాగే ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌లో 'నేను హీరోను కాదు విలన్' అంటూ గోపీచంద్ చెప్పే డైలాగు హైలెట్‌గా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com