Pareshan Teaser Release: పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే...!

తిరువీర్‌ హీరోగా రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో తెరకెక్కిన పరేషాన్‌

తెలుగు చిత్ర సీమలో ఈ మధ్య చిన్ని చిత్రాలకు విపరీతమైన ఆదరణ నెలకొందనే చెప్పాలి. వైవిధ్యమైన కథా, కథనాలతో ఆకట్టుకుంటోన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎవరు ఏ పాయింట్ చెప్పినా దానికి బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఈ కోవలోనే దర్శకుడు రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో పరేషాన్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల మసూదలో నటించి అందరినీ ఆకట్టుకున్న తిరువీర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా, తాజాగా సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. అవారాగా తిరిగే కుర్రాళ్ల చుట్టూ కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట ్అయితే ఉందని స్పష్టమవుతోంది. ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం అందించే ఉద్దేశంతోనే ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. గతంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబుతో కొబ్బరి మట్ట అనే సినిమా తెరకెక్కించి దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న రూపక్... పరేషాన్‌ తో మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి యశ్వంత్‌ నాగ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక టీజర్ విడుదలైన 3 గంటల్లోనే లక్షల వ్యూస్‌తో య్యూట్యూబ్‌ ను షేక్ చేసేస్తోంది. మరి ఈ సినిమాలో దర్శకుడిగా రూపక్- హీరోగా తిరువీర్ ఎలాంటి విజయాన్ని కైవసం చేసుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story