Paruchuri Gopala Krishna: 'ఆ మలుపు బాలేదు'.. 'సర్కారు వారి పాట'పై పరుచూరి రివ్యూ..

Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాక్‌తో పాటు మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. మే 12న విడుదలయిన ఈ సినిమా చాలారోజుల పాటు ఏ పోటీ లేకుండా థియేటర్లలో నడిచింది. అయితే ఈ సినిమా వేరేలాగా ఉంటే బాగుండేది అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. ఇటీవల ఆయన రివ్యూను చెప్పారు.
పరుచూరి పాఠాలు పేరుతో సినిమాల గురించి, వాటి విశేషాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వీడియోలకు మంచి ఆదరణే లభిస్తోంది. ఇప్పటికీ ఎన్నో సినిమాలపై ఆయన అభిప్రాయాన్ని చెప్పిన గోపాలకృష్ణ.. ఇటీవల సర్కారు వారి పాటపై కూడా తన రివ్యూను బయటపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని చెప్పడంతో పాటు ఇందులో నెగిటివ్ ఏంటో బయటపెట్టారు.
సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్ ఇండియాకి తిరిగి రావడం అనే మలుపు బాగా లేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అలా కాకుండా కీర్తి సురేశ్, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్నారు. సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కూడా ఒకే ఫ్లైట్‌లో ఇండియా వచ్చుంటే ఆ సమయంలో మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు యాడ్ అయ్యేవి అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ మార్పులన్నీ చేసుంటే సినిమా మరో రూ.100 కోట్లు రాబట్టేది అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com