టాలీవుడ్

Patton Oswalt: 'ఆర్ఆర్ఆర్'పై హాలీవుడ్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Patton Oswalt: పాటన్ ఓస్వాల్ట్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. తర్వాత ట్విటర్ వేదికగా దీనిపై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు

Patton Oswalt: ఆర్ఆర్ఆర్పై హాలీవుడ్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
X

Patton Oswalt:'బాహుబలి'తో రాజమౌళి పేరు రాష్ట్రాలు దాటే కాదు.. దేశాలు దాటి కూడా వెళ్లింది. అది కూడా 'ఆర్ఆర్ఆర్' మూవీకి పెద్ద ప్లస్‌గా మారింది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా నటించిన 'ఆర్ఆర్ఆర్'.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు కూడా ఆర్ఆర్ఆర్ చూసి.. దీనిపై ట్వీట్ చేశాడు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్.. తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌కు అప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా.. ఈ సినిమాతో వారు ఎన్నో భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలామంది ఫేవరెట్ మూవీ లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్ యాడ్ అయిపోయింది. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

హాలివుడ్ స్క్రీన్ రైటర్, యాక్టర్ పాటన్ ఓస్వాల్ట్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆ తర్వాత ట్విటర్ వేదికగా దీనిపై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'మీకు అందుబాటులో ఉన్న థియేటర్లలో ఈ సినిమా లేకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. ఆర్ఆర్ఆర్ మూవీ ఒక అద్భుతం' అని ట్వీట్ చేశాడు పాటన్. అంతే కాకుండా మీరు ఇంక సినిమాలు చేయొద్దు. మీరు ముందు ముందు ఏం చేస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నాడు పాటన్.


Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES