పవన్ కళ్యాణ్.. పదిహేను ప్రాజెక్టులు

పవన్ సినిమా ఫ్యాన్స్‌కు ఓ ఎనర్జీ బూస్టర్ లాంటిది. ఆయన సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుని తలకెత్తుకున్నారు పవన్. యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించే దిశగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్‌పి సహకారంతో 15 ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. నేటి యువతీ యువకుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంది. వారిలోని టాలెంట్‌ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా పవన్ ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. ఇందులో 6 మధ్య తరహా చిత్రాలు, 6 చిన్న తరహా చిత్రాలు, 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి.
పవన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి పనిచేస్తున్నాయని తెలిసింది. ఎందుకంటే ఇద్దరూ కొత్త కథలను చెప్పేవారిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. గతంలో 'ఓ బేబీ' వంటి విజవంతమైన చిత్రాన్ని అందించిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. అతను ఇప్పటికే పది సినిమాలను ఇతర నిర్మాతలతో కలిసి లేదా సొంతంగా నిర్మిస్తున్నారు.
ప్రాజెక్టుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిచేయనున్నారు. యువ ప్రతిభావంతుల ఆలోచనలను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచేలా పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై యువ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవర్ స్టార్ పవన్ వ్యక్తిత్వానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
కాగా ఏప్రిల్ 9న థియేటర్లలో సందడి చేయనున్న వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. మరో రెండు ప్రాజెక్టులు పవన్ చేతిలో ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న 'హరిహర వీరమల్లు' అయితే మరొకటి రానాతో కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com