Pavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్..

Pavan Tej Konidela: ఈమధ్యకాలంలో ఎంతోమంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమలో విడాకులు తీసుకొని విడిపోతున్న వారి సంఖ్య ఎంత ఉందో.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే ఉంది. తాజాగా మెగా హీరోల్లో ఒకరైన కొణిదెల వారసుడు కూడా తన సహ నటిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకొని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో చాలామంది ఇప్పుడు తమ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్ నుండి వైష్ణవ్ తేజ్ వరకు అందరి సక్సెస్ ట్రాక్ బాగానే ఉంది. అదే సమయంలో కొణిదెల వారసుడిగా మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తనే పవన్ తేజ్ కొణిదెల.
పవన్ తేజ్ కొణిదెల ముందుగా మెగా హీరోల సినిమాల్లో విలన్‌గా అలరించాడు. ఆ తర్వాత 'ఈ కథలో పాత్రలు కల్పితం' అనే చిత్రంతో హీరోగా మారాడు. అదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది మేఘన. ఇక ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖతో మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com