Pavitra Lokesh: రెమ్యునరేషన్ పెంచేసిన పవిత్రా లోకేష్.. ఎంతంటే..?

Pavitra Lokesh: సినిమాల్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలానే క్రేజ్ ఉంటుంది. పైగా లీడ్ రోల్స్ చేసేవారి కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులే వరుస సినిమాలతో ఎక్కువ బిజీగా ఉంటారు. అందుకే డిమాండ్‌ను బట్టి వీరు కూడా రెమ్యునరేషన్‌ను పెంచుతూ ఉంటారు. తాజాగా పవిత్రా లోకేష్ కూడా తన రెమ్యునేషన్‌ను పెంచేసినట్టు టాక్ వినిపిస్తోంది.
గత కొంతకాలంగా పవిత్రా లోకేష్ పర్సనల్ లైఫ్ గురించి ఫిల్మ్ సర్కి్ల్స్ చర్చించుకుంటున్నాయి. దీనిపై తాను కూడా స్పందించింది. అయినా కూడా ఈ రూమర్స్‌కు చెక్ పడలేదు. తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న రూమర్స్.. తన ప్రొఫెషనల్ లైఫ్‌కు ప్లస్సే అయ్యాయి. అందుకే ముందుకంటే ఎక్కువగా పవిత్రా లోకేష్ సినిమా ఆఫర్లు అందుకుంటోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లకు తల్లి పాత్ర పోషించిన పవిత్రా లోకేష్.. రోజువారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే ఇంతకు ముందుకు రోజుకు రూ.60 వేలు రెమ్యునరేషన్ తీసుకునేదట పవిత్రా. కానీ ఆఫర్లు ఎక్కువగా వస్తుండడంతో ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచిందని టాక్. ప్రస్తుతం పవిత్రా లోకేష్ రోజూవారీ రెమ్యునరేషన్ రూ.1 లక్ష అని కథనాలు వెలువడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com